ఇవాళ్టి నుంచి జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. ఎండాకాలంలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదయింది.
ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నేటి నుంచి ఎన్నదేవత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని జిల్లాలలో గరిష్టంగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండలతో పాటు వడగలుపులు విపరీతంగా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి జనాలం తా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లేకపోతే పెను ప్రమాదం తప్పదని తెలిపింది.