ఆత్మగౌరవాన్ని వెలకట్టే దుస్థితి దేశంలో నెలకొంటుంది : ఈటల రాజేందర్

-

ఊర్లలో సర్పంచ్ ని కావాలన్న ఎంపీపీని చేయాలన్న నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతున్నారు. ఆత్మగౌరవాన్ని వెల కట్టే దుస్థితి ఈ దేశంలో వచ్చిందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. పైసలు ఉంటేనే ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఎంపీ అయ్యే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఈటల రాజేందర్ మల్కాజిరి నియోజకవర్గంలోని మౌలాలి గీతా నగర్ పార్క్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఎల్.బి.నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని వాసవి శ్రీ నిలయంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. పొలిటికల్ లీడరికి మెరిట్ ఏంటంటే ఎంత డబ్బుంది, ఎంత దాదాగిరీ చేయగలడు ఇదే మెరిట్ తప్ప ప్రజల జీవితాలు ఏంటి ? మనం ఏం చేయాలి అన్న మెరిట్ లేదన్నారు. ప్రపంచంలో చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించే సత్తా వారికే ఉంటుందని తెలిపారు. కానీ ఇప్పుడున్న క్రైటీరియాలో ఎట్లా సంపాదించాలో తెలియదు కానీ, సంపాదించాలి. ఖర్చు పెట్టాలి.. మళ్ళీ సంపాదించాలి ఇది నేటి రాజకీయమన్నారు. మల్కాజిరి లో బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు అభ్యర్థులను మార్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ముగ్గురు నలుగురు అభ్యర్థులను మార్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version