సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో వేదింపులు ఆగడం లేదు. నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకవుతుందంటూ పీఈటీ జ్యోత్స్న వేధిస్తోందంటూ విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ ఘోరం జరిగింది.
డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మోబైల్ ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ కొడుతోందని ఆక్షేపణకు గురైయ్యారు విద్యార్థినులు. వెంటనే న్యాయం చేయాలంటూ సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డు ఎక్కారు. పీఈటిని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు.. 500కు పైగా విద్యార్థినులకు రెండు బాత్రూమ్స్ ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టిన బెబ్బలని చూపిస్తూ ఏడ్చారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.