దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ మరియు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉండనున్నారు. దీంతో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించింది గులాబీ పార్టీ.
పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే BRS అభ్యర్థుల పేర్లు
1)ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్ .టి )మాలోత్ కవిత
3) కరీంనగర్ -బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్ .
9) నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్