ఓటు వేసేటప్పుడు వెంట తీసుకెళ్లాల్సిన గుర్తింపు కార్డులు ఇవే..

-

తెలంగాణ శాసనసభ సమరంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నారు. మరోవైపు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించారు.

అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోల్‌ చీటీలు అందకపోతే గుర్తింపు కార్డు ఉన్నా సరిపోతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అదెలా అంటే.. మొదటగా గతంలో ఎక్కడ ఓటేశారో అక్కడ బీఎల్వోల వద్దకు వెళ్తే.. వారు ఓటరు జాబితాలో సరి చూసి ఓ చీటిపై క్రమసంఖ్య, పేరు రాసిస్తారని అధికారులు తెలిపారు.  కొత్తగా ఓటు వచ్చిన వారు మాత్రం దరఖాస్తు సమయంలో ఏ కేంద్రం అని నమోదు చేసుకున్నారో, అక్కడికి వెళ్లి పోల్‌ చీటీ పొందాలని అధికారులు సూచించారు.

ఇక.. ఓటు వేసేటప్పుడు వెంట తీసుకెళ్లాల్సిన గుర్తింపు కార్డులు ఇవే..

  • ఫొటో ఓటరు స్లిప్పు
  • ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్‌)
  • ఆధార్‌ కార్డు
  • పాసుపోర్టు
  • డ్రైవింగ్‌ లైసెన్సు
  • కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు
  • బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి)
  • పాన్‌కార్డు
  • జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు
  • ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు
  • కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు
  • ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు
  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం.

Read more RELATED
Recommended to you

Latest news