తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు : డిప్యూటీ సీఎం భట్టి

-

ప్రజల ఆస్తిని కాపాడిన  తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. HCU వ్యవహారం పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. హైకోర్టులో కేసు గెలిచామని.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా వేల కోట్ల భూమిని కాపాడామని తెలిపారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా నిరుద్యోగులకు ఉద్యాగాలు కల్పించాలని మేము తాపత్రాయపడుతున్నామని.. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు.

మేము చేసే ప్రతి పని సంపద ఎలా సృష్టించాలనే అని ఆయన తెలిపారు. యూనివర్సిటీ భూములు కాదని.. HCU కి సంబంధించిన ఇంచు భూమిని మేము తీసుకోమని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాల్సిన అవసరం ఉందని.. HCU భూములను ప్రభుత్వం గుంజుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు భట్టి విక్రమార్క. 

Read more RELATED
Recommended to you

Latest news