పుష్ప 2 కలెక్షన్లలో 10% ఆ కుటుంబానికి ఇవ్వాలి : తీన్మార్ మల్లన్న

-

సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిస్తాలాటలో గాయపడిన శ్రీ తేజ్ హెల్త్ కండిషన్ వైద్యులను అడిగి తెలుసుకున్నాను అని MLC తీన్మార్ మల్లన్న అన్నారు. అబ్బాయి కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అబ్బాయి కాన్షియస్ లో లేడు. ట్రీట్మెంట్ గురించి వైద్యుల్ని అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేము అంటున్నారూ. అందరూ అల్లు అర్జున్ ను కలుస్తున్నారు గాని అసలు కలవాల్సింది గాయపడిన శ్రీ తేజను. అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారని ప్రచారం చేస్తున్నారు.

ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా వాలు బంద్ పెట్టాలి. రేపు మండలిలో ఈ విషయంపై మాట్లాడుతాను. అందుకే ఈరోజు శ్రీతేజ్ కుటుంబ సభ్యులు కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. పుష్ప 2కు భారీ కలెక్షన్లు వచ్చాయని విన్నాను. అందులో 10% అయినా శ్రీ తేజ్ కుటుంబానికి ఇవ్వాలి. ఇకమీదట బెనిఫిట్ షో విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుంది. అయితే శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version