కెప్టెన్ లేని నౌకలా బీఆర్ఎస్ పార్టీ ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఖరీ పై విమర్శలు చేశారు. తుఫాన్ లో చిక్కుకున్న షిప్ లా ఎక్కడికి వెళ్తోందో కనీసం వారికి కూడా తెలియడం లేదని బీఆర్ఎస్ పై సెటైర్ వేశారు. నాయకుడు లేకపోతే పార్టీ ఎలా ఉటుందో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉందని సభలో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ కి లేదన్నారు. ప్రతీపక్షం ఇలా ఉండకూడదన్నారు.
మిగతా అంశాలు చర్చకు రాకూడదన్నది బీఆర్ఎస్ లక్ష్యం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను మిస్ గైడ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూమి లేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్ఎస్ వద్దంటుందని రైతులకు మేలు జరగడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టారో వారికే అర్థం కావడం లేదని మండిపడ్డారు.