చంద్రబాబు ప్రభుత్వం అంటేనే పేపర్ల లీకేజీ ప్రభుత్వం : రవిచంద్ర

-

రాష్ట్రంలో పరీక్షా పత్రాల లీకీజీ విద్యాశాఖ అసమర్ధతకు నిదర్శనం అని విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. Sa1 పరీక్షలే నిర్వహించలేని ప్రభుత్వం ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తుంది.. అసలు పబ్లిక్ పరీక్షల పత్రాలు లీక్ అవవన్న గ్యారెంటీ ఏం ఉంది అని అడిగారు. అలాగే ప్రశ్నా పత్రాలను కూడా సరిగా అందించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. లోకేష్ కి ఆ శాఖ మీద ఏమాత్రం పట్టు లేదని మళ్ళీ రుజువు చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే పేపర్ల లీకేజీ ప్రభుత్వం అని అర్ధం. తండ్రి సీఎంగా, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా మళ్ళీ లీకేజీలు ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు. ఇక జగన్ హయాంలో విద్యావిప్లవాన్ని తెస్తే చంద్రబాబు హయాంలో పేపర్ల లీకేజీలు జరుగుతున్నాయి. ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క పథకమూ అమలు చేయని దీనస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. లోకేష్ నిద్ర లేచి ప్రశ్నాపత్రాల లీకేజీలను ఆపాలి అని రవిచంద్ర పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version