హైడ్రా నోటీసులపై సీఎం రేవంత్ సోదరుడి స్పందన ఇదే!

-

హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్డడాలను హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు శరవేగంగా కూల్చివేస్తున్నారు.యుద్ధ ప్రాతిపదికన అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న ఇళ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ హైడ్రా అధికారులు గురువారం నోటీసులు అందజేశారు.

అయితే, హైడ్రా అందజేసిన నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి తాజాగా స్పందించారు. 2015లో అమర్ సొసైటీలో నివాసం కొనుగోలు చేశాను. ఆ సమయంలో ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ తన నివాసం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చారు.

కాగా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను నెలరోజుల్లోగా కూల్చివేయాలని అధికారులు నోటీసులు లిచ్చారని తెలిపారు.
ఇదిలాఉండగా, ప్రభుత్వ నిబంధనలు, చట్టం మేరకే నడుచుకోవాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news