లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతోనే పరిస్థితి మారిందని అన్నారు.
మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారని తెలిపారు. తెలంగాణలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మా వంద రోజుల పాలనను ప్రజల ముందు పెట్టి ఓట్లు అడిగినట్లు గుర్తుచేశారు. వందరోజుల పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. మా పాలనను చూసే తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరినట్లు చెప్పారు. ఎనిమిది చోట్ల తమను, ఎనిమిది చోట్ల బీజేపీని గెలిపించారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 41 శాతం ఓట్ల లభించాయని తెలిపారు. బీఆర్ఎస్ తనకు తాను ఆత్మబలిదానం చేసుకోవడం వల్ల బీజేపీ పుంజుకుందని చెప్పారు. హరీశ్ రావు కావాలనే బీజేపీకి ఓట్లు బదలాయించారని వెల్లడించారు.