తెలంగాణలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండడానికి ప్రభుత్వం, మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్, సభ్యులను లేకుండా చేసిందని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిని తీసుకువచ్చి తమ చారిటీ భూములను ఆగం చేశారని అన్నారు. కెసిఆర్ ను కలవడానికి ప్రగతి భవన్ కి వెళితే తనను అడ్డుకున్నారని వాపోయారు కేఏ పాల్.
బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటేనని.. తానే ప్రధాన ప్రతిపక్షం అని అన్నారు. కెసిఆర్ మిత్రుడు కాబట్టే కిషన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. తాను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ప్రకటించారు. తన డబ్బుంతా అమెరికాలో ఉందని.. ఆ డబ్బు మొత్తాన్ని తీసుకువచ్చి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానన్నారు.