తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం జరిగింది. ఈసారి ఏకంగా పాదరక్షలు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత… తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక ప్రచారాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ అలాగే పాన్ పరాక్… ఇలా రకరకాల నిషేధిత పదార్థాలను పట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంత మంది భక్తులు వెళ్లడం జరిగింది.
వాళ్లందరినీ గతంలో పోలీసులు పట్టుకోగా.. తాజాగా చెప్పులు వేసుకుని కొంత మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమల శ్రీవారి ముఖద్వారం దగ్గరికి వెళ్లగానే.. పాదరక్షలతో బయలుదేరిన వారిని అధికారులు అడ్డుకున్నారు. వస్తావంగా తిరుమల శ్రీవారి దర్శనం నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ ఆ మూడు స్థానాల్లో కూడా టిటిడి అధికారులు చెప్పుల విషయాని గుర్తించలేదు. తిరుమల ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత అధికారులు గుర్తించారు. ఇక అధికారుల నిర్లక్ష్యంపై టిటిడి పాలకమండలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది.
తిరుమలలో అపచారం
శ్రీవారి దర్శనానికి పాదరక్షలతో మహా ద్వారం వరకు వచ్చిన భక్తులుమూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన గుర్తించని టిటిడి విజిలెన్స్
ముగ్గరు భక్తులు పాదరక్షలు ధరించి వచ్చిన మహా ద్వారం గుర్తింపు#AndhraPradesh #TTD pic.twitter.com/ZSFk99ciiL
— Telugu Feed (@Telugufeedsite) April 12, 2025