నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లే – తుమ్మల నాగేశ్వరరావు

-

నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు గెలిచినట్లేననంటూ సంచలన స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగు గడ్డమీద పచ్చ జెండా ఎగరాలి అనేదే నా ఆలోచన అని పేర్కొన్నారు. ఏపీ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయం నేను ఉంచుకోనన్నారు. ఈ టిడిపి పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.

ఖమ్మం నియోజకవర్గం లో తనను… పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ వందల కోట్లు ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉందని… కోట్లు కుమ్మరించి తమ నాయకులు అలాగే కార్యకర్తలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. తాము అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలు అన్నిటికీ చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు తుమ్మల. పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version