తెలంగాణ రైతులకు ఊహించని షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు భరోసా వర్షాకాలం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది. రైతు భరోసా పథకం పైన రైతుల అభిప్రాయం సేకరించిన తర్వాతనే… నిధులను విడుదల చేస్తామని… అప్పటివరకు నిధులు విడుదల చేసేది లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు.
తాజాగా మీడియాతో ముచ్చటించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రుణమాఫీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి అసత్య ప్రచారాలు పేపర్లో కూడా వస్తున్నాయని… వాటిని నమ్మకూడదని తెలిపారు. ఏడాది నుంచే పంటల బీమా కూడా అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రానికి వానకాలం సీజన్లో… 6.49 లక్షల టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా… కేంద్రం అంతవరకు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 5.14 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఇచ్చిందని ప్రకటించారు తుమ్మల నాగేశ్వరరావు. ఎరువులు అలాగే యూరియా పూర్తిస్థాయిలో పంపించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు.