సవాళ్లకు ఎదురొడ్డి నిలబడటం వినేశ్‌ స్వభావం: ప్రధాని మోదీ

-

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్లో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో వినేశ్‌ తలపడాల్సి ఉండగా.. ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యావత్ భారత్ దుఃఖంలో మునిగిపోయింది. గుండె పగిలిందంటూ భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత అంశంపై స్పందిస్తూ.. ‘వినేశ్‌.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్‌’ అని అన్నారు. దేశానికే గర్వకారణమంటూ ప్రశంసించారు. ప్రతీ భారతీయుడికి స్ఫూర్తి అని కొనియాడారు. ఇవాళ జరిగిన ఘటన బాధించవచ్చన్న ప్రధాని మోదీ.. సవాళ్లకు ఎదురొడ్డి నిలబడటం వినేశ్‌ స్వభావం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్‌ చేసేందుకు ఐవోఏ సిద్ధమైనట్లు సమాచారం. ఇక వేటు పడిన తర్వాత వినేష్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news