పొంగులేటిని,నన్ను ఓడించేందుకు రూ.వందల కోట్లు : తుమ్మల

-

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం లో తనను… పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ వందల కోట్లు ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉందని… కోట్లు కుమ్మరించి తమ నాయకులు అలాగే కార్యకర్తలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు.

thummala slams brs party

తాము అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలు అన్నిటికీ చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు తుమ్మల. పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. అఫిడవిట్ కు సంబంధించి ఫార్మాట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇంత రస వత్తర పోటీ, ఇంత కసి పట్టుదల ఉన్న ఎన్నికలు చూడలేదన్నారు. ఓ పక్క ఖమ్మం జిల్లా ఒకపక్క తెలంగాణ రాష్ట్రమంతా…. అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్నాయని వెల్లడించారు తుమ్మల నాగేశ్వరరావు. పరువు రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికలపై అలాగే ఖమ్మం ఎన్నికలపై పందాలు నిర్వహిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news