ముఖ్యమంత్రి రేసులో ఉన్న జనారెడ్డి నామినేషన్ తిరస్కరణ !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న జానారెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. జానారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించారు ఎన్నికల అధికారులు. నవంబర్ మూడవ తేదీన ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ముగిసింది. దీంతో పలువురి నామినేషన్ల ను పరిశీలన చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కొంతమంది నామినేషన్లు తిరస్కరించబడుతున్నాయి. ఇందులో భాగంగానే నాగార్జునసాగర్ నియోజకవర్గ నుంచి ఈ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.

Janareddy nomination rejected
Janareddy nomination rejected

వాస్తవానికి ఇక్కడి నుంచి ఆయన తనయుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నామినేషన్లు, మానకొండూరు నియోజకవర్గం లో ఏడు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి మూడు నామినేషన్లు తిరస్కరించారు. ఇటు ఈటెల రాజేందర్ భార్య ఈటల జమున నామినేషన్ కూడా తిరస్కరించారు ఎన్నికల అధికారులు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 600 వరకు నామినేషన్లను రిజెక్ట్ చేశారట అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news