తెలంగాణ సీఎంగా కేటీఆర్ అయితే హరీష్ రావు పాత్ర ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ రావు మాట్లాడుతూ… కేటీఆర్ కు నాకు మధ్యలో దూరం పెంచే విధంగా ఇలా అడుగుతుంటారు… కేటీఆర్ నేను మంచి ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ అని వివరించారు.
గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ పని అప్పజెప్పితే… ఆ పని నేను చేస్తానని… అలాగే సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తానని స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా… నేను సీఎం కేసీఆర్ వెంట ఉంటానని తెలిపారు. కేసీఆర్పై నమ్మకం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయి.. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. నాకు నేను ట్రబుల్ షూటర్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు.. హరీశ్ రావు ఏనాడు కేసీఆర్ మాట జవ దాటలేదని వెల్లడించారు. కేసీఆర్ మూడో సారి హ్యాట్రిక్ కొడతారు.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను పాటిస్తానన్నారు హరీశ్ రావు.