ఆక్యూపెన్సీ పెరగాలంటే ఆ స్టేషన్లలో వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వండి..

-

కేంద్రం ప్రభుత్వం ఇటీవల సికింద్రాబాద్-నాగపూర్ మధ్య కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రైలు పట్టాలెక్కింది. వందేభారత్ రైలు సర్వీసు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రూట్లో రద్దీ చాలా విపరీతంగా ఉంటుంది. అయితే, వందేభారత్‌కు ఆశించిన మేర ఆక్యూపెన్సీ లేదని సమాచారం. ఎందుకంటే ఎక్కువ స్టేషన్లలో హాల్టింగ్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

రైలులో మొత్తం 1328 సీట్లలో దాదాపు 1110 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఆక్యూపెన్సీ 15.81 శాతానికి మించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలోని కాజీపేట, రామగుండం స్టేషన్లలోనే ఈ రైలు ఆగుతున్నది. ఈ క్రమంలోనే పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్‌లో రైలుకు హాల్టింగ్ ఇస్తే ఆక్యూపెన్సీ రేషియో పెరుగుతందని ప్రయాణికులు కోరుతున్నారు. ఎందుకంటే సింగరేణి ప్రాంతం కావడంతో చాలా మంది ప్రజలు ఈ స్టేషన్ల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news