తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇకపై అపోహలు వద్దు : టీటీడీ

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టీటీడీ స్పందించింది. ఇకపై లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భక్తులను కోరింది. తెలిసి తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోయాయని వెల్లడించింది. ఇక మీదట స్వచ్చమైన నెయ్యితోనే లడ్డూలు తయారుచేస్తున్నట్లు తెలిపింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ చేస్తున్నామని తెలిపింది.

ఇదిలాఉండగా, తిరుమల లడ్డూను జంతువుల కొవ్వుతో తయారీ చేసినట్లు, అందుకు గత ప్రభుత్వమే కారణమని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు తేల్చారు. దీంతో గత వైసీపీ ప్రభుత్వంపై హిందూవులతో పాటు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news