ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు ప్రత్యేక సెలవు

-

ఎట్టకేలకు తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు జరిగినా మిగతా అంతా ప్రశాంతంగానే జరిగింది. ఎన్నికల అధికారులు గత కొంత కాలంగా పోలింగ్ ఏర్పాట్లలో బిజీ బిజీగా గడిపారు. ఇక ఇప్పుడు డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అయితే పోలింగ్​ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్​ పరిసర జిల్లాల్లో అయితే నవంబర్ 29, 30వ తేదీల్లో రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.

ఇక సెలవులు పూర్తి కావడంతో ఇవాళ అందరూ తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి మాత్రం ఇవాళ ప్రత్యేక సెలవు ఇచ్చారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈవో వికాస్‌ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పోలింగ్ విధుల్లో పాల్గొన్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇవాళ ప్రత్యేక సెలవు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news