నేడు మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..!

-

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌. నేడు మాదాపూర్ లో కూల్చివేతలు రంగం సిద్దం చేస్తోంది హైడ్రా. నేడు మాదాపూర్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేయనుంది హైడ్రా. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.

Today Hydra is preparing the field of demolitions in Madapur

అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రా కు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్..అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారట. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..ఈ మేరకు ఆదివారం కూల్చాలని తెలిపారట. దీంతో నేడు మాదాపూర్ లో కూల్చివేతలు రంగం సిద్దం చేస్తోంది హైడ్రా. దీంతో మాదాపూర్ లో పోలీసులు భారీగా మోహరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news