ఢిల్లీలో ఈ రోజు వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నా చేయనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో షర్మిల ధర్నా చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ… ఈ ధర్నాకు దిగుతున్నారు వైఎస్ షర్మిల. ధర్నా అనంతరం “పార్లమెంట్ ముట్టడి” ఆలోచనలో వై.ఎస్.ఆర్.టి.పి.అధినేత షర్మిల ఉన్నట్లు సమాచారం.
కాగా, వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటినే కాళేశ్వరం లెక్కల్లో చూపిస్తున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా 20 వేల కోట్లకు అంచనాలు పెంచడంలో అవినీతి లేదా ? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల . ఇంత అవినీతి జరిగితే కనిపించడం లేదా ? అని నిలదీశారు. ఈ ప్రాజెక్టు పై విచారణ చేయాల్సిన అవసరం లేదా ? అని ఆగ్రహించారు. మూడేళ్లకే కాళేశ్వరం మునిగిపోయిందని.. పంప్ హౌస్ ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారన్నారు వైఎస్ షర్మిల.