ఇవాళ పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ మరోసారి పాలమూరుకు బయలు దేరనున్నారు. సీఎం రేవంత్ నేడు పాలమూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశం అవుతారు.

Today the CM of Palamuru district is Revanth Reddy

మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఇతర నేతలతో చర్చిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు. కాగా మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్బంగా  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రావాలనుకున్నారు. కానీ మణిపూర్ పర్యటనలో ఉన్నందున రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తు పెట్టుకున్నామంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దారు. ప్రతీ కుటుంబంలో బలమైన ముద్ర వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news