ములుగు జిల్లాలో కుండపోత..ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వెంకటాపురంలో అత్యధికంగా 227 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మంగపేట, వాజేడు వెంకటాపురం మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. కలెక్టరేట్ లో 18004257109 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. వరంగల్, జనగామ, హనుమకొండ, జిల్లాల్లో స్వల్పంగా వర్షం కురుస్తోంది.