నాగబాబుకు మంత్రి పదవిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. జనసేన పార్టీ నిర్మాణంపై ఇప్పటివరకు నేను దృష్టి పెట్టలేదన్నారు పవన్ కళ్యాణ్. ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంపై పని చేస్తాను అని వ్యాఖ్యానించారు. రాజధాని భూసేకరణలో ఇష్టం ఉన్న రైతులే భూములు ఇవ్వండి, బలవంతం లేదన్నారు.

నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదని పేర్కొన్నారు. దానిపై నేనే నిర్ణయం తీసుకోవాలని… రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు తప్పవు అని వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.