కెసిఆర్ కి కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగులుతుంది – రేవంత్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగులుతుందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాండూర్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన దరిద్రుడు నువ్వే కదా? అని మండిపడ్డారు. 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లేకుండా చేస్తే కేసీఆర్ కి, ఆయన కొడుకుకి ఎదురు ఉండదని అనుకున్నాడని.. కానీ ఇప్పుడు వగల ఏడుపు ఏడుస్తున్నాడని అన్నారు.

ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన ఆ పాపం కేసీఆర్ కి ఊరికే పోతున్నారు. తనని ఆరోజు అన్యాయంగా జైల్లో పెట్టారని, తన కూతురి లగ్న పత్రికకు కూడా పోకుండా చేశాడని మండిపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సిబిఐ వచ్చిందని.. ఆ పాపం ఊరికే పోదు అన్నారు రేవంత్ రెడ్డి. మా ఉసురు నీకు తగులుతుందని అన్నారు.

తాను తెలంగాణకి సీఎం అయినా కాకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరం అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న రేవంత్ రెడ్డి.. కెసిఆర్ ఎన్నికల కోసం గురుకులాడుతున్నాడని, కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version