తెలంగాణ పీసీసీ పీఠం బీసీలకే!

-

తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతకు ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న పార్టీ హైకమాండ్ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులు కూడా ప్రకటించనున్నట్లు తెలిసింది. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీసీ సామాజిక వర్గానికి చెంది ప్రచార కమిటీ సభ్యుడు మధుయాస్కీ గౌడ్‌, ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాంనాయక్‌ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం.

ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్లు చర్చకు రాగా.. ఇప్పటికే ఈ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, దామోదర రాజనర్సింహలకు పదవులు కట్టబెట్టగా.. ఇక పీసీసీ పీఠం బీసీలకే ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ సామాజిక వర్గం నుంచి మహేశ్ కుమార్ గౌడ్, మధు యాస్కీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడుతున్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version