నేడు చేవెళ్లలో కాంగ్రెస్ సభ.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు

-

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇవాళ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభా వేదికగా ప్రియాంకా గాంధీ వర్చువల్ గా సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకం పథకాలను ప్రారంభించనున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో, రద్దీని నియంత్రించటానికి ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

ఇవాళ సాయంత్రం బహిరంగ సభ దృష్ట్యా, మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి, సాధారణ ప్రజలు దారి మళ్లింపులను చూసుకుని ప్రత్యామ్నాయ మర్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ నుంచి చేవెళ్ల, వికారాబాద్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రగతి రిసార్ట్స్‌, యెంకేపల్లి ఎక్స్‌ రోడ్డు, ఆలూర్‌ ఎక్స్‌ రోడ్డు, వికారాబాద్‌ వైపు మళ్లించనున్నారు.

  • వికారాబాద్‌ నుంచి చేవెళ్ల, మొయినాబాద్‌, హైదరాబాద్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఆలూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఆలూర్‌, యెంకేపల్లి ఎక్స్‌ రోడ్డు, ప్రగతి రిసార్ట్స్‌, హిమాయత్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-163 నుంచి హైదరాబాద్‌ వైపు మళ్లిస్తారు.
  • షాబాద్ నుంచి వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పమెన ఎక్స్ రోడ్డు వద్ద పమెన, బస్తేపూర్, ఎన్‌హెచ్ 163 వైపు మళ్లిస్తారు.
  • శంకరపల్లి నుంచి చేవెళ్ల వైపు వచ్చే ట్రాఫిక్‌ను యెంకేపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ఆలూర్‌ గేట్‌, ఎన్‌హెచ్‌ 163 వైపు మళ్లిస్తారు.
  • హిమాయత్‌నగర్‌ నుంచి చేవెళ్ల వైపు వచ్చే ట్రాఫిక్‌ను ముడిమ్యాల గేట్‌, రావులపల్లి, మల్కాపూర్‌, చేవెళ్ల, ఎన్‌హెచ్‌ 163, వికారాబాద్‌ వద్ద మళ్లించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version