గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.

వాహనదారులకు ప్రత్యామ్నాయ రూట్లను సూచించారు ట్రాఫిక్ పోలీసులు. గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రారంభమై తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వద్ద ముగియనుంది హనుమాన్ శోభాయాత్ర. అటు నేడు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్ లోని మందుబాబులకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ షాక్ ఇచ్చారు. ఇవాళ నగరంలోని వైన్ షాపులన్నీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని సూచించారు.