సంగారెడ్డిలో దారుణం జరిగింది. బస్సు ఎక్కుతూ కాలుజారి కింద పడి ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్ చేరు పట్టణం లోని బస్ స్టాండ్ ముందు RTC బస్సు ఎక్కుతుండగా కాలుజారి బస్సు వెనుక చక్రం కింద పడి జాన్ మొహమ్మద్ (49) అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇక మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఇక తాజా గా చికిత్స పొందుతూ ప్రయాణికుడు జాన్ మొహ మ్మద్ మృతి చెందాడు. మృతుడు పటాన్ చేరు లో డ్రైవర్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. మెదక్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సుగా గు ర్తించి…పటాన్ చేరు పోలీసులకు పిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. ఇక సంఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.