విశాఖ శారద పీఠానికి టీటీడీ నోటీసులు..!

-

విశాఖ శారదా పీఠానికి ఊహించని శాఖ తగిలింది. విశాఖ శారద పీఠానికి టిటిడి పాలకమండలి అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్న విశాఖ శారద పీఠం మఠానికి నోటీసులు ఇచ్చింది టీటీడీ పాలక మండలి. 15 రోజుల్లో మఠం ఖాళీ చేసి, ఆ భవనాన్ని టిటిడి పాలక మండలికి అప్పగించాలని అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

TTD

స్థానిక గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠం భవనం ముందు అలాగే వెనుక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలకమండలి చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా.. విశాఖ శారదా పీఠానికి నోటీసులు కూడా ఇష్యూ చేసింది టీటీడీ పాలక మండలి. టీటీడీ నోటీసులు ఇవ్వడంతో కోర్టును ఆశ్రయించింది విశాఖ శారదా పీఠం బృందం. అయితే అక్కడ కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. దీంతో 15 రోజుల్లో విశాఖ శారదా పీఠం.. ఖాళీ చేయాల్సి వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news