తెలంగాణాలో విషాదం.. పెళ్లయిన రెండు రోజులకే మృతి….!

-

 

పెళ్ళింట విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మరణించిన ఘటన రంగారెడ్డి లోని బడంగ్ పెట్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…. లక్ష్మీదుర్గ కాలనీకి చెందిన విశాల్ (25)కు ఈనెల 7వ తేదీన వివాహం జరిగింది. తెల్లవారు జామున వధువుతో కలిసి ఇంటికి చేరుకోగానే వరుడు గుండె పోటుకు గురయ్యాడు.

వెంటనే కుటుంబ సభ్యులు విశాల్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విశాల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే విశాల్ కన్నుమూశారు. దీంతో పెళ్ళింట విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాల్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతడి మరణ వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news