చత్తీస్గడ్ లో మనీష్ అనే యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతడికి విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ ఫోన్ కాల్స్ చేశారు. అతడు వాడుతున్న మొబైల్ నెంబర్ గతంలో ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటీదార్ ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల పాటు రజత్ పాటీదార్ ఫోన్ నెంబర్ ఇన్ యాక్టీవ్ గా ఉండడంతో ఫోన్ నెంబర్ ను మనీష్ అనే యువకుడికి కంపెనీ కేటాయించింది.

దీంతో రజత్ పాటీదార్ కు కోహ్లీ, డివిలియర్స్ ఫోన్ కాల్స్ చేయగా మనీష్ మాట్లాడారట. దీంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే యువకుడి వద్దకు చేరుకొని అతడు వాడుతున్న సిమ్ తీసుకొని రజత్ పాటీదార్ కు అప్పగించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. మనీష్ విరాట్ కోహ్లీకి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.