కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగురోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో శిక్షణలో ఉన్న పైలట్ శ్రీకరన్ రెడ్డి 26 సం ” లు అక్కడిక్కడే మృతి చెందాడు. కీసర నుండి ఘట్కేసర్ వైపు వెళ్తున్న i10 కార్ TS 08 FV 2468 , కారు లో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థలం గజ్వేల్ వాసిగా గుర్తించారు పోలీసులు.
అయితే… నేరెడ్ మీట్ ప్రాంతం లో మృతుడి కుటుంబం స్థిరపడిందని సమాచారం. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి , గత వారం రోజుల క్రితం తన ఇంటికి రావడం జరిగిందని తెలిపారు కుటుంబ సభ్యులు. యాదగిరి గుట్ట కు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పి తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడు శ్రీకారన్ రెడ్డి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.