తెలంగాణ రాజ్య సమితి పార్టీ ( TRS )కి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని టిఆర్ఎస్ విజ్ఞప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత…. తెలంగాణ రాజ్య సమితి అనే పేరుతో రాష్ట్రంలో కొత్త పార్టీ నమోదయింది.
ఇది ఇలా ఉండగా, TRS పార్టీ అసలు ఎవరిదీ ? సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం ఈ పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్ లోని తన ఇంటిని పార్టీ అడ్రస్ గా పేర్కొన్నారు. 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్న ఆయన….1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్ గా, 2001లో టిఆర్ఎస్ సిద్దిపేట మండలం పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జడ్పీటీసీగా, 2019-2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు.