Ts Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు..ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు, విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు, గృహ నిర్మాణానికి 7740 కోట్లు, నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు పెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మాది ప్రజల ప్రభుత్వమని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజం మార్పును కోరుకుందని చెప్పుకొచ్చారు. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.