BREAKING : తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలీసెట్-2022) పరీక్ష ను తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ల లోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై ఈ ఎంట్రెన్స్ నిర్వహించారు.
ఈ పరీక్ష జూన్ 30 వ తేదీన జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,13,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 365 పరీక్ష కేంద్రాల లో పరీక్ష జరిగింది. అలాగే… ఈ పరీక్షకు 1,04,432 మంది హాజరు అయ్యారు కాగా.. 91.62 శాతం హాజరు అయ్యారు. అయితే.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET Results)ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.