అతడంటే క్రష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కృతి శెట్టి..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈమె వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది బేబమ్మకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలకు కొదవ ఉంటుందేమో కానీ హీరోయిన్లకు మాత్రం కొదవలేదని చెప్పాలి. చాలామంది మోడలింగ్ రంగంలో చేసిన వారు కూడా ఇటీవల హీరోయిన్లుగా అవతారం ఎత్తి మంచి విజయాలను అందుకుంటున్నారు. అంతేకాదు ఇతర భాషా చిత్రాల నుండి వచ్చిన చాలామంది అమ్మాయిలు కూడా ఇటీవల తెలుగులో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొన్ని నెలల్లోనే హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోండి ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తున్న ది వారియర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా జూలై 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగానే శరవేగంగా పాల్గొంటుంది. ఇకపోతే ది వారియర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ముఖ్యంగా సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్నకు కృతి శెట్టి స్పందిస్తూ శివ కార్తికేయన్ అంటే తనకు చాలా ఇష్టమని తన యాక్టింగ్ చాలా బాగా ఇష్టపడతానని తెలిపింది. అంతేకాదు తమిళ్ నేర్చుకోవడం కోసం ఎక్కువగా శివ కార్తికేయన్ సినిమాలు మాత్రమే చూస్తుంటానని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈమె తెలుగుతోపాటు తమిళ్లో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీబిజీగా తన కెరీర్ ను గడుపుతోంది. తమిళ్ విషయానికి వస్తే సూర్య తర్వాత విశాల్ సరసన నటించబోతున్న ఈమె తెలుగు విషయానికి వస్తే నితిన్ తర్వాత నాగచైతన్యతో నటించడానికి సిద్ధంగా ఉంది. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version