తుంగతుర్తి ఎమ్మెల్యేకు చుక్కెదురు.. కౌంటర్ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..!

-

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గాదరి కిషోర్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారం రోజు  కొట్టివేసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని గాదరి కిషోర్ కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేశారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ దాఖలు చేసిన పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ వీడియో పుటేజీని ఇవ్వాలని  తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news