TV9 Rajinikanth Notices to TDP workers: టీవీ9 రజనీకాంత్‌పై అసత్య ప్రచారం చేసిన టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చింది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ నెల 28న విచారణకు రావాలని ఆదేశించారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. టీవీ9 రజనీకాంత్ అక్రమంగా భూములు సంపాదించాడని టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేశారు.

దింతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీవీ9 రజనీకాంత్. దింతో టీవీ9 రజనీకాంత్‌పై అసత్య ప్రచారం చేసిన టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చింది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. అటు టీవీ9 రజినీకాంత్‌కు ఐటీ నోటీసులు వచ్చాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే ఖండించారు. మరోవైపు తాజాగా ఈ వ్యవహారంపై ఆయన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. రజినీకాంత్‌కు ఐటీ నోటీసులు అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై 469,505 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.