స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు అరెస్టు

-

సికింద్రాబాద్‌ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో మహంకాళి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్​లోని ఐదో అంతస్తులో క్యూనెట్ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు క్యూనెట్ సంస్థకు సంబంధించి కొన్ని కీలక విషయాలు తెలిశాయి.

క్యూనెట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తుందన్న విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దీంతో అక్కడి ఉద్యోగులు తాము కూడా లక్షలు చెల్లించామని మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 30 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఈ కేసును మహంకాళి పోలీస్ స్టేషన్ నుంచి నగర సీసీఎస్​కు బదిలీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ కేసులోనే కేడియా ఇన్ఫోటెక్ నిర్వాహకుడు అశోక్ , క్యూనెట్ సంస్థ సీఈవో శివనాగమల్లయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక ఈ నెల 16న జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version