హెల్మెట్‌ను త‌క్కువ‌ అంచ‌న వేయ‌లేం : హైద‌రాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ వైర‌ల్

-

బైక్ ప్ర‌యాణాలు చేసే క్ర‌మంలో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. అయితే హెల్మెట్ ధ‌రించ‌డం వ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త చాలా వ‌ర‌కు తగ్గే అవ‌కాశం ఉంటుంది. అయితే హెల్మెట్ ధ‌రించాల‌ని తెలంగాణ పోలీసులు అనేక ర‌కాలుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. హెల్మెట్ ధ‌రిస్తే.. ప్రాణాల‌కు హానీ జ‌ర‌గ‌ద‌ని, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణం చేయ‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు. అంతే కాకుండా షార్ట్ ఫిల్మ్ ను కూడా తీసి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహాన క‌ల్పిస్తున్నారు.

అలాగే హెల్మెట్ లేకుండా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల వీడియోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తు వాహ‌నాదారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అలాగే హెల్మెట్ ధ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు.. ప్రాణాలు ర‌క్షించుకున్న రోడ్డు ప్ర‌మాదాల వీడియోల‌ను కూడా పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగ తాజా గా హైద‌రాబాద్ సిటీ పోలీసులు కూడా ఇలాంటి ఒక వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. అంతే కాకుండా Never Underestimate the Power of HELMET అంటూ క్యాప్షన్ ను కూడా జ‌త చేసి హెల్మెట్ ప్రాముఖ్య‌తను తెలిపేలా ఫోస్టు చేశారు. కాగ ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news