తెలంగాణకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్..8రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం !

-

తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణకు కొత్త రైల్వే మార్గాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం రాత్రి మోడీ కేబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మోడీ కేబినెట్.

Union Cabinet approves 8 key railway projects

అయితే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏకంగా 8 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో ఒడిశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్, అలాగే బెంగాల్ లో మొత్తం 25 వేల కోట్లతో… ఈ ప్రాజెక్టును చేపట్టనుంది ఈ మోడీ ప్రభుత్వం.

ఇందులో ముఖ్యంగా ఒడిస్సా లోని మల్కాన్ గిరి నుంచి భద్రాచలం మీదుగా… పాండురంగాపురం వరకు కొత్త రైల్వే నిర్మాణం.. పనులు చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 4 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలాగే 200 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్ ఉండబోతుంది. ఇక ఈ రైల్వే లైన్ పూర్తి అయితే ఏపీ అలాగే తెలంగాణ మధ్య… తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news