కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు – హరీష్ రావు

-

చౌటుప్పల్ లో 5 పడకల డయాలసిస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 5 పడకల డయాలసిస్ ఏర్పాటు చేశామన్నారు. డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలో మార్గదర్శంగా నిలబడ్డామన్నారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ పర్యటకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాదిగ్రస్తులకు ఇస్తున్న చికిత్స చూసి తెలంగాణ తరహా లోనే తమిళనాడులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పెన్షన్లు దేశంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఏర్పడ్డాక 50 లక్షల డయాలసిస్ పెన్షన్లు పూర్తి చేసామన్నారు. ఒక సంవత్సరానికి ఒక డయాలసిస్ సెంటర్ నిర్వహణకు వందకోట్ల వరకు ఖర్చ చేస్తున్నామని తెలిపారు.

రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మెడికల్, పీజీ సీట్లను పెంచి ఎంబిబిఎస్ విద్యార్థులు విదేశాల కు వెళ్లకుండా తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఎయిమ్స్ ఆస్పత్రి ఇస్తామంటే ఐదు కోట్ల విలువైన భూమి ఇచ్చామని.. కానీ అక్కడ ఎంబిబిఎస్ చదువుకున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కేంద్రం కల్పించలేదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version