యాదాద్రి వరకు MMTS పొడిగింపు : కిషన్ రెడ్డి

-

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న పార్లమెంట్ సభ్యులతో సమావేశం జరిగింది. వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను లేవనెత్తడం జరిగింది. రైల్వే శాఖ నిర్మాణాత్మకమైన పనులు చేస్తోందని వారు చెప్పారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగిల్ లైన్ ఉన్న చోట డబులింగ్ చెయ్యడం… ట్రిపులింగ్ చెయ్యడం చేస్తున్నారు. ఎలెక్ట్రిఫికేషన్ చేసే పనిలో SRC మోడీ ఆలోచనలకు అనుగుణంగా పోతున్నాము. కొత్త రైల్వే స్టేషన్లు, రెన్నోవేషన్ పనులపై అందరూ సానుకూలంగా ఉన్నారు. రైల్ మేనిఫాక్చరింగ్ యూనిట్ రాబోతుంది.

ప్రస్తుతం 5 వందే భారత్ లు ఉన్నాయి.. రానున్న రోజుల్లో పెంచాలని కోరారు. 40 రైల్వే స్టేషన్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 430 కోట్ల తో పూర్తయ్యింది. ఇక యాదాద్రి వరకు MMTS పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలి. గట్కేసర్ వరకు ఉంది.. రాయగిరి, యాదాద్రికి ఎక్సటెండ్ చెయ్యాలి. 650 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. 2/3 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి… కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం.. స్వతహాగా ఈ పనులు పూర్తి చేయబోతోంది. వచ్చే రెండేళ్లలో ఈ రూట్ ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తాం అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version