ఆ ప్రాంతాలకు వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు : మంత్రి నారాయ‌ణ‌

-

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లిలోని అంజనాపురం కాల‌నీలో వాంతులు,విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి పొంగూరు నారాయ‌ణ జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. అయితే నీరు క‌లుషితం కావ‌డం వ‌ల్ల చ‌నిపోయారా లేక వేరే కార‌ణాలున్నాయా అనే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త‌ రాలేదు. అయితే స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్ కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని మంత్రి నారాయ‌ణ ఆదేశాలు వారి చేసారు. అలాగే బోర్ల‌ను అన్నింటిని మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు.

ఇద్ద‌రు మృతి చెంద‌డంతో పాటు మ‌రో ఆరుగురు ప్ర‌యివేట్ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపిన క‌లెక్ట‌ర్.. హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేయ‌డంతో పాటు పారిశుద్య పనులు ముమ్మ‌రం చేసిన‌ట్లు వెల్లడించారు. డ్రెయిన్ ల‌తో పూడిక యుద్ద ప్రాతిప‌దికన తొల‌గించ‌డంతో పాటు మంచి నీటి బోర్ల‌ను అన్నింటిని త‌నిఖీ చేయాల‌ని.. అవ‌స‌ర‌మైతే ఇత‌ర మున్సిపాల్టీల నుంచి సిబ్బందిని ర‌ప్పించాల‌న్నారు మంత్రి. అక్కడ సాధార‌ణ ప‌రిస్ధితి వ‌చ్చే వ‌ర‌కూ మున్సిప‌ల్, వైద్యారోగ్య శాఖ అధికారులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version