మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే దేశం బాగు పడుతుంది : కిషన్ రెడ్డి

-

సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ లో జేసిఐ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేసారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 100 కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. గత కొన్నేండ్ల క్రితం నేను అంబర్​ పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్​ డెవలప్​ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విస్తరించాయి. మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు వారి కాళ్ల మీద వారి నిలబడాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు అందజేస్తున్నాం.

పేద, మధ్య తరగతి మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం. స్టార్టప్​ లు, ముద్ర రుణాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించి.. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘డ్రోన్​ దీదీ’ పేరిట కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికే 15 వేల గ్రామాల్లో పైలెట్​ ప్రాజెక్టు కింద శిక్షణ ఇచ్చి 15 వేల డ్రోన్లు ఇచ్చాం. అన్ని బ్యాంకులకు కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ముద్ర బ్యాంకు, స్వనిధి యోజన, స్వయం సహాయక సంఘాలకు లక్షల రూపాయల లోన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు ఈ సమాజం బాగు పడుతుంది. ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version