Uppal Skywalk : ఏప్రిల్​లో ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం

-

హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు, ఫ్లై ఓవర్, ఫూట్ ఓవర్, స్కైవాక్​లు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే మెట్రో, ఫ్లై ఓవర్​లు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్ చౌరస్తాలో నిర్మిస్తున్న స్కైవాక్​ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏప్రిల్​లో దీని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.

స్కైవాక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇన్నర్‌ రింగు రోడ్డు ఉప్పల్‌ చౌరస్తాలో తరచూ ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యలను, పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో చేపట్టిన ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి.

ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 660 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న స్కైవాక్‌లో 9 లిప్టులు, 3 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పాదచారులు రోడ్డు దాటకుండా స్కైవాక్‌ ద్వారా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా మార్గాలను నిర్మించారు. అత్యాధునిక నిర్మాణ శైలిలో స్కైవాక్‌ను నిర్మిస్తున్నామని అర్వింద్‌కుమార్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version